Posts

Showing posts from June, 2018

చైతు అంత నచ్చాడా మాధవ్

Image
నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి కోసం చాలా ఏళ్ళ తర్వాత మాధవన్ తెలుగు స్ట్రెయిట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే . గతంలో ఎన్నో సినిమాల కోసం ఆఫర్స్ వచ్చినప్పటికీ తెలుగు బాష మీద గ్రిప్ లేని కారణంగా వదిలేసుకుంటూ వచ్చిన మాధవన్ ను సవ్యసాచి కథ మాత్రం బాగా ఎగ్జైట్ చేసిందట. అందుకే ఒప్పుకున్నట్టు తెలిసింది. దానికి తోడు చందు మొండేటి థ్రిల్లర్ ని టేకప్ చేసిన తీరు కార్తికేయలో చూసిన మాధవన్ ఎక్కువ ఆలోచించకుండా ఓకే చేసినట్టు తెలిసింది. సవ్యసాచి ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజి లో ఉంది. విడుదల ఇంకా ఖరారు కాలేదు. దీని తర్వాత చైతు నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇంతకు ముందే చెప్పాడు. శైలజరెడ్డి అల్లుడు తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది.  ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం మాధవన్ నే తీసుకోబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. సవ్యసాచి టైంలో చైతుకు మాధవన్ కు మంచి బాండింగ్ కుదరటంతో దీనికి కోసం రాయబారానికి చైతూనే పంపారట యూనిట్. కానీ మాధవన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. సవ్యసాచిలో తనకు వచ్చే స్పందన బట్టి నిర్ణయం తీసుకుంటానని చ...

ఈ సమ్మర్ ఆమెదేనబ్బా..

Image
పెళ్లి అయినంత మాత్రాన కథానాయిక కథ ముగిసిందని అనుకోవడానికేమీ లేదని రుజువు చేసిన సూపర్ హీరోయిన్ సమంత అక్కినేని. పెళ్లయ్యాక కూడా తన ఉనికిని చాటుకోవడమే కాదు.. తిరుగులేని విజయాలతో కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్తోందామె. నెలన్నర వ్యవధిలో మూడు భారీ విజయాలందుకుని.. ఆ మూడు సినిమాలతో మంచి పేరు కూడా సంపాదించి అబ్బురపరిచింది సామ్.  2018 వేసవి సమంతకే సొంతమని చెప్పాలి. సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియా మొత్తంలో సమంతలా ఈ సమ్మర్లో హవా సాగించిన ఆర్టిస్టు మరొకరు లేరు.  ఈవేసవి ఆరంభంలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అందులో సమంత నటనకు గొప్ప ప్రశంసలు కూడా లభించాయి. ఇక  గత నెలలో‘మహానటి’ లాంటి మెమొరబుల్ మూవీతో పలకరించింది సామ్. ఈ చిత్రంలోనూ సమంత పాత్ర.. నటన ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఈ చిత్రం తమిళంలోనూ అదరగొట్టింది. ‘మహానటి’ వచ్చిన రెండు రోజులకే తమిళంలో విడుదలైన ఆమె కొత్త సినిమా ‘ఇరుంబు తిరై’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట సమ్మె తర్వాత రిలీజైన పెద్ద సినిమా ఇదే. ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు తగ్గట్లే టాక్ అదిరిపోయింది. మంచి వసూళ్లు వచ్చాయి. సమంత పాత్రకూ మంచి పేరు వచ్చింద...

ఎప్పటికీ శ్రీదేవి నాతోనే ఉంటుంది:బోనీ

Image
ఈ ఏడాది ఫిబ్రవరి 24న `అతిలోక సుందరి` - ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దుబాయ్ లో బంధువుల వివాహవేడుకకు హాజరైన శ్రీదేవి....అక్కడి జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయిన విషయం విదితమే. శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె భర్త బోనీకపూర్ - కూతుళ్లు జాన్వీ - ఖుషీలతో పాటు అభిమానులంతా  శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో  జూన్ 2న తమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బోనీకపూర్ బాధాతప్త హృదయంతో ఓ ట్వీట్ చేశారు. తన అర్ధాంగి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లినా....ఆమె తన జ్ఞాపకాల్లో ఎల్లపుడూ జీవించే ఉంటుందని ట్వీట్ చేశారు. గతంలో దివంగత శ్రీదేవి ఉపయోగించిన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా``శ్రీదేవీ బోనీ కపూర్ ``లో బోనీ కపూర్ ఈ ట్వీట్ చేయడం విశేషం. ఆ ట్వీట్ తో పాటు దుబాయ్ లో జరిగిన వివాహ వేడుకలో ఆఖరిసారి శ్రీదేవి చేసిన సందడి దృశ్యాల వీడియోను కూడా బోనీ కపూర్ పోస్ట్ చేశారు.   1996 - జూన్ 2న బోనీ కపూర్ - శ్రీదేవిల వివాహం జరిగింది. వారిద్దరికీ 1997లో జాన్వీ జన్మించగా - 2000లో ఖుషి జన్మించింది. ఈ ఏడాది జాన్వీ బాలీవుడ్ లో తెరంగేట్రం చేయబోయే ల...

అప్పుడు నానికి ఇప్పుడు తేజుకి

Image
సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యు జూన్ 29 విడుదల కోసం రెడీ అవుతోంది. ఇంకా టైం ఉన్నప్పటికీ ప్రమోషన్ ప్రాధాన్యత తెలుసు కాబట్టి టీమ్ ఇప్పటి నుంచే అలెర్ట్ గా ఉంటోంది. నిన్న సరదాగా తేజ్ ఐ లవ్ యు యూనిట్ కు రేడియో ఆర్జెలకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఆల్బమ్ లోని మొదటి పాట  అందమైన చందమామ ను విడుదల చేసారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి దర్శకుడు కరుణాకరన్. తెలుగులో తన మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ నుంచి సంగీతం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే కరుణాకరన్ తేజ్ ఐ లవ్ యు కోసం కూడా అవే ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపిస్తోంది. నిన్ను కోరి-ఊపిరి లాంటి సెన్సిబుల్ మూవీస్ కి అద్భుతమైన స్కోర్ ఇచ్చిన గోపి సుందర్ దీనికి కూడా అదే మేజిక్ చేసుకుంటాడు అనే అంచనాలో ఉన్నారు మ్యూజిక్ లవర్స్. దానికి తగ్గట్టే  నిన్న రిలీజ్ చేసిన అందమైన చందమామ పాట స్లో పాయిజన్ లాగా మెలోడీ లవర్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. క్యాచీ పదాలతో సీనియర్ రచయిత సాహితి చక్కని సాహిత్యం అందించారు క్యూట్ మెలోడీగా ఫస్ట్ సాంగ్ పాస్ అయిపోయింది కాబట్టి నాని కోసం ఇ...

మోహన్ బాబు పుణ్యమే అంటున్న విశాల్

Image
తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు నిర్మించిన జీకే రెడ్డి తనయుడు విశాల్. నిజానికి అతను హీరో కావాలని అనుకోలేదు. దర్శకుడు కావాలని అనుకున్నాడు. ఆ విభాగంలో పని చేశాడు కూడా. విశాల్ అన్న హీరో కావాలనుకున్నాడు. కానీ జరిగింది వేరు. విశాల్ హీరో అయ్యాడు. అతడి అన్నయ్య నిర్మాతగా మారాడు. ఐతే తాను హీరోగా మారడంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పాత్ర కీలకం అంటున్నాడు విశాల్. తనలో హీరో లక్షణాలున్నాయని.. హీరోను చేయమని తన తండ్రికి ముందుగా సలహా ఇచ్చింది మోహన్ బాబే అని విశాల్ వెల్లడించడం విశేషం. విశాల్ కొత్త సినిమా ‘అభిమన్యుడు’ విజయవంతం అయిన నేపథ్యంలో మంచు విష్ణు అతడికి అభినందనలు తెలపగా.. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు విశాల్. నేను హీరో కావడానికి మీ నాన్నే కారణం.. ఇప్పుడు నేనీ స్థాయిలో అందుకు ఆయన మా నాన్నకిచ్చిన సలహా వల్లే. ‘అభిమన్యుడు’ సక్సెస్ లో కూడా ఆయనకు క్రెడిట్ ఉంది.. అని విశాల్ అన్నాడు. చెల్లమే (తెలుగులో ప్రేమ చదరంగం) అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయిన విశాల్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. గత కొన్నేళ్లలో వైవిధ్యమైన థ్రిల్లర్లతో పెద్ద హిట్లు కొట్టాడు. ఐతే ఒకప్పుడు విశాల్ కు తెలుగులోనూ మంచి ...

చైతు మూవీలో మ్యాడీ పాత్ర ఇదేనా

Image
నాగ చైతన్య హీరోగా చందు మొండేటి రూపొందిస్తున్న సవ్యసాచి షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. నిజానికి ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ నెల మూడో వారంలో విడుదల కావాలి. కానీ కొంత ప్యాచ్ వర్క్ తో పాటు సిజి కూడా బాలన్స్ ఉండటంతో ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇకపోతే ఇందులో మాధవన్ నటించిన రోల్ ఎలా ఉంటుందా అనే అంచనాలు ముందు నుంచి ఆసక్తి రేపుతూనే ఉన్నాయి. తన బర్త్ డే సందర్బంగా  విషెస్ చెబుతూ యూనిట్ షేర్ చేసుకున్న స్టిల్ లో మాధవన్ లుక్ చూస్తుంటే ఇందులో ఏదో స్టైలిష్ విలన్ గా కొత్త తరహా పాత్ర  చేసినట్టు కనిపిస్తోంది. అంటే ముందు నుంచి అనుకున్నట్టు చైతుకు ఛాలెంజ్ విసిరే పవర్ ఫుల్ పాత్రలో మాధవన్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇది  పోస్టర్ ని బట్టి వేసిన అంచనానే అయినప్పటికీ నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ తక్కువ స్థాయిలో ఇంతవరకు ఏ సినిమా నిర్మించని  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందటం ట్రేడ్ లో ఆసక్తి రేపుతోంది.  ఒక చేయి తన ఆధీనంలో ఉండని ఆసక్తికరమైన పాత్ర చేస్తున్న చైతుతో మాధవన్ ఆడే ఆట చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. దానికి తో...

లేడి ఒరియెంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్న కాజల్

Image
కాజల్కాగర్వాల్ డ్రీమ్స్ ఇంకా తీరలేదట ఆశకు అంతం ఉండదంటారు. టాలీవుడ్ చందమమా కాజల్‌ ఈ కోవకు చెందన వ్యక్తినే అనిపిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్‌ ఇండస్ట్రీస్ లో టాప్ హీరోయిన్ అనిపించుకుంది. బాలీవుడ్ లో సైతం ఒకటి రెండు సక్సెస్ లు అందుకుంది. బట్ అక్కడ ఈ బ్యూటీ కోరుకున్న స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతోంది. ఈ లాంగ్ జర్నీలో కాజల్‌ అగర్వాల్‌ కోరిక మాత్రం తీరలేదట. దీంతో కొన్ని కలలు కలలుగానే మిలిగిపోతాయేమో అని నిటూర్పుగా చెప్పుతోంది. అసలు అలాంటి కోరికలు నేరవేరితే ఎంత బాగుండో అనిపిస్తోందని కానీ ఎందుకో అవి తీరడం లేదని ఈ బ్యూటీ తెగ బాధపడుతోంది. కాజల్ అగర్వాల్ కి లేడి ఓరియెంట్ మూవీస్ చేయాలని ఉందట. అవి కూడా అల్లాటప్పా మూవీస్ కాదట. లేడి బ్రూస్ లీ రేంజ్ లో కాజల్ అగర్వాల్ పంచ్ లతో విలన్స్ ని చిత్తు చేసే హెవీ యాక్షన్, మూవీ చేయాలనేది ఆమె డ్రీమ్ అట. దీంతో పాటు పుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్స్ లో కూడా నటించాలనే ఆశ ఉందంట. కానీ ఈ పదేళ్ల లో అలాంటి యాక్షన్‌ క్యారెక్టర్స్ లో నటించలేదని, అందుకే అలాంటి పాత్రలు కలగానే మిగిలిపోయాయని ఈ బ్యూటీ బాధపడుతోంది. వ్యక్తిగతంగా తనకు మంచి భ...

ప్రియదర్శి ఇంట ‘పెళ్లి సందడి’

Image
ప్రియదర్శి, రిచా పెళ్లిచూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు ప్రియదర్శి ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఫ్రెండ్‌గా దాదాపు అన్నిసినిమాల్లో కనిపిస్తున్నాడు ఈ హాస్యనటుడు. తెలంగాణ యాసలో తనదైన కామెడీ టైమింగ్‌తో దూసుకుపోతున్నాడు. కెరీర్‌ పరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ప్రియదర్శి కొత్త బంధాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా తనకు కాబోయే జీవిత భాగస్వామి రిచాను అభిమానులకు పరిచయం చేశాడు ప్రియదర్శి. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని వార్తలు ఫిలిం నగర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్‌లో ప్రియదర్శి వివాహం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేవలం ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే పాల్గొననున్నారు. తరువాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం 26న గ్రాండ్‌ గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు.

ఈ నగరానికి ఏమైంది?’ మోషన్‌ పోస్టర్‌

Image
పెళ్లి చూపులు మూవీతో చిన్న సినిమా స్టామినా ఏంటో నిరూపించాడు ఆ చిత్ర దర్శకుడు  తరుణ్‌ బాస్కర్‌ . తీసిన ఆ ఒక్క సినిమాతో పెద్ద సక్సెస్‌ సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.  పెళ్లి చూపులు  సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా... ఇంకో సినిమాను తెరకెక్కించలేదు ఈ యువ దర్శకుడు.  ఈ నగరానికి ఏమైంది అంటూ సాగే ఒకప్పటి ఫేమస్‌ యాడ్‌లోని ఫస్ట్‌ లైన్‌ను తన సినిమా టైటిల్‌గా ఎంచుకున్నాడు. నీ గ్యాంగ్‌తో థియేటర్‌కు రా చూస్కుందాం అంటూ టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిగా రేకెత్తెలా చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ  మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంట్లో సినిమాలోని  నలుగురు కుర్రాళ్లను పరిచయం చేశాడు. మీరంతా గ్యాంగ్‌తో రండి... ఈ సమ్మర్‌లో మిమ్మల్ని గోవాకు తీసుకెళ్తాం అంటూ పోస్టర్‌ను రిలీజ్‌చేశారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చెల్లి కోసం వచ్చి పెళ్లయిన అక్కని తీసుకెళ్లాడు

Image
చెన్నై:  పెళ్లిచూపులకు వెళ్లడం, అమ్మాయి నచ్చితే వివాహం చేసుకోవడం, లేకుంటే మరో సంబంధానికి వెళ్లడం మగవారికి మామూలే. అయితే ఓ ప్రబుద్ధుడు చిన్నకూతురిని చేసుకునేందుకు పెళ్లిచూపులకు వచ్చి పెళ్లయి బిడ్డ తల్లయిన పెద్దమ్మాయిని లేపుకెళ్లాడు. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విచిత్రం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్‌లై వీధికి చెందిన ఓ వ్యక్తికి 26, 22 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లయి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న ఆయన సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో అన్నాదురై (28) అనే వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి అమ్మాయిని చూశాడు. ఇదే సమయంలో పెద్దమ్మాయితో మాట కలిపి వెళ్లిపోయాడు. పెళ్లిచూపుల గురించి అమ్మాయి తండ్రికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే పెద్దమ్మాయితో టచ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని అన్నాదురైతో అక్క ఇల్లు వదిలి లేచిపోయింది.

శ్రియా పెళ్లయిపోయిందిగా

Image
అదేంటి శ్రేయ శరన్ పెళ్లి ముచ్చట గతంలోనే చెప్పుకున్నాం కదా మళ్ళి ఇదేంటి అనుకోకండి. ఇక్కడ చెప్పింది శ్రియ భూపాల్ గురించి. ప్రముఖ వ్యాపారవేత్త జివికె మనవరాలు శ్రియా భూపాల్ నిశ్చితార్థం గతంలో అఖిల్ తో జరిగి ఆ తర్వాత పెళ్లి మరికొద్ది రోజుల్లో జరుగుతుంది అనంగా బ్రేక్ అప్ అయిన సంగతి తెలిసిందే. కారణాలు బయటికి చెప్పలేదు కానీ ఏదో జరిగింది అనే దాని గురించి రకారకాల ఊహాగానాలు చెలరేగాయి. అదంతా గతం. అఖిల్ సినిమాల్లో బిజీ అయ్యాడు కానీ శ్రియా భూపాల్ పెళ్లి మాత్రం అయిపోయింది. అపోలో అధినేత ప్రతాపరెడ్డి మనవడు ఉపాసన కజిన్ అనిందిత్ రెడ్డితో ఎవరు ఊహించని వెడ్డింగ్ డెస్టినేషన్ లో పెళ్లి జరిగిపోయింది. ఇతను అపోలోకు సంబంధించిన కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు రేస్ కార్ స్పోర్ట్స్ మెన్ గా నేషనల్ మోటార్ స్పోర్ట్స్ పర్సన్ లాంటి అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఇక శ్రియ భూపాల్ విషయానికి వస్తే తానొక ఫాషన్ డిజైనర్ అన్న సంగతి తెలిసిందే. తన పేరు మీదే శ్రియ సోమ్ అనే సంస్థ కూడా ఉంది. ఫ్రాన్స్ లో పారిస్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాన్ట్యూ చాంటిల్లి అనే చరిత్రాతక కోట లాంటి ప్రదేశంలో అపోలోతో పాటు జివికె కుటుంబం ...

టైమంతా దానికే సరిపోయింది

Image
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది సొట్ట బుగ్గల సుందరి షాలినీ పాండే. ఆ సినిమాలో లెక్కకు మించి లిప్ లాక్ సీన్లు ఉంటాయని తెలిసే చేశానని.. భవిష్యత్తులోనూ లిప్ లాక్ సీన్లు చేయడానికి తానేమీ వెనుకాబోనని అంటోంది షాలినీ. కానీ అది స్క్రిప్ట్ డిమాండ్ చేయాలని.. వల్గారిటీ కోసం అయితే ఎప్పటికీ చేయననే చెబుతోంది. సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నానని అందుకే ఇంట్లోవాళ్లు కాదన్నా పట్టుపట్టి సినిమాల్లోకి వచ్చానని అంటోందీ భామ. ‘‘ఇంజినీరింగ్ తరవాత బుద్ధిగా నేను జాబ్ చేయాలన్నది మా అమ్మానాన్నల కోరిక. నాకేమో సినిమాలంటే పిచ్చి. కాలేజ్ రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ముందుండేదాన్ని. సినిమాల్లోకి రావాలని చాలా ప్రయత్నాలు చేసి చివరకు అర్జున్ రెడ్డి హీరోయిన్ గా సెలక్ట్ అయ్యా. ఇందులో ఈ మూవీలో ఇంటిమేట్  సీన్స్ చేశానని నా బాయ్ ఫ్రెండ్ నాకు దూరమైపోయాడు అంటూ రూమర్ కూడా వచ్చింది. కానీ నాజీవితంలో ఇంతవరకు ప్రేమలోనే పడలేదు. ఇంక విడిపోవడమనే మాటెక్కడ. నా టైం.. ఓపిక అంతా నేను సినిమాల్లోకి రావడానికి మా అమ్మానాన్నల్ని ఒప్పించడానికే సరిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చింది షాలినీ పాండే. ...

కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లుంది

Image
కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు సినిమా ప్లాప్ కి కూడా వెయ్యి కారణాలు చెప్పడం ఈ రోజుల్లో మేకర్స్ బాగా అలవాటైపోయింది. సక్సెస్ అయితే ప్రతిది బాగుంటుంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ సంబరాలు చేసుకునే విధానం ఒక లెవెల్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్లాప్ అయితే ఎదో ఒక కారణం కాకుండా సమయాన్ని బట్టి పలు రకాల కారణాలు చెబుతుండడం హాట్ టాపిక్ అయ్యింది.   ఓక సినిమా నిర్మించాలి అంటే నిర్మాతలకు శక్తికి మించిన పని. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు ఆ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే మేకర్స్ మాత్రం కంటెంట్ కంటే ఎక్కువగా ఇతర విషయాలపై ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కాంబినేషన్స్ అంటే చాలు వెంటనే నిర్మాతలు కూడా ఆశపడి డబ్బులు ధారపోస్తున్నారు. దీంతో ఆ తరువాత తెల్ల మొహం వేయక తప్పడం లేదు. ఈ మధ్య కాలంలో కాంబినేషన్ ఇచ్చిన డిజాస్టర్స్ లిస్ట్ పెద్దగానే ఉంది.  చెబితే మనోభావాలు దెబ్బ తింటాయి అంటారు. ఇక సినిమాలో మ్యాటర్ లేకుండా తెరకెక్కించి ఫ్లాప్ అయితే ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదు. రివ్యూలు దెబ్బేశాయి అంటారు. రివ్యూలు బాగా వచ్చినప్పుడు అదే పోస్టర్ లో వేసుకొని ప్రమోషన్స్ చేసుకుంటారు. ఫ...

సొంత డెన్ సమకూర్చుకున్న తాప్సి

Image
టాలీవుడ్టా హీరోయిన్ గా పేరు తెచ్చుకుని కాస్త పేరు.. డబ్బు సంపాదించి ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా పేరు తెచ్చుకునే పనిలో బిజీగా ఉంది పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను. రీసెంట్ గా జుడ్వా-2లో అందాలు ఆరబోసి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. బిజీ హీరోయిన్ కాకపోయినా కాల్షీట్లు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది.  హీరోయిన్ గా ఇప్పటికీ ఆఫర్లు వస్తుండటంతో తాప్సి సంపాదనకు లోటేమీ లేదని చెప్పాలి. అన్నట్టు తాప్సీకో చెల్లెలుంది. ఆమె పేరు షగున్ పన్ను. అక్కలా సినిమాల్లోకి రాకుండ వెడ్డింగ్ ప్లానర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ముంబయిలో సెలబ్రిటీలతో కాస్త పరిచయాలు ఉండటంతో షగున్ కు చేతినిండా పని ఉంది. వరస ఈవెంట్స్ తో దూసుకుపోతోంది. అక్కాచెల్లెళ్లిద్దరికీ చేతినిండా సంపాదన ఉండటంతో ఇద్దరూ కలిసి ముంబయిలో తాజాగా ఓ ఇల్లు కొన్నాడు. దీనికి పన్ను డెన్ అని పేరు కూడా పెట్టారు. హౌస్ టు హోమ్ అంటూ టైటిల్ పెట్టి తాము కొన్న ఇంటిముందు అక్కచెల్లెళ్లిద్దరూ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  కొన్నాళ్ల క్రితం ఆనందో బ్రహ్మ సినిమాలో నటించి నవ్వులు పూయించిన తాప్సీ తాజాగా మరోసారి తెలుగు తెరపై కనిపించనుంది. రంగస్...

మహేష్ లేట్ వెనక ఆయనున్నాడా

Image
మహేష్మబాబుకు చకచకా సినిమాలు చేయడంలో చాలానే గుర్తింపు ఉంది. ఒక సినిమా చేసేటప్పటికే మరో సినిమాను లైన్ లో పెట్టేసి ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేసి రెడీగా ఉడండం.. ఆ తర్వాతి ప్రాజెక్టుకు స్టోరీ డిస్కషన్స్ చేయడం సూపర్ స్టార్ కు అలవాటు. ఇంత స్పీడ్ గా ప్రాజెక్టులను లైన్ లో పెట్టే మరో హీరో టాలీవుడ్ లో కనిపించడు కూడా. అయితే.. మహేష్ రీసెంట్ మూవీ భరత్ అనే నేను రిలీజ్ అయ్యి దాదాపు నెలన్నర కావస్తోంది. కానీ మన హీరో మరుసటి చిత్రం ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. మహేష్25వ చిత్రంగా రూపొందనున్న ఈ ప్రాజెక్టుకు వంశీ పైడిపల్లి డైరెక్షన్ వహించనుండగా.. అన్ని పనులు పూర్తయినా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఇందుకు.. మహేష్ తో గతంలో బ్రహ్మోత్సవం అంటూ సినిమా తీసిన ప్రొడ్యూసర్ పీవీపీ కారణం అనే రూమర్ వినిపిస్తోంది. ఆగడు ఫ్లాప్ తర్వాత.. మహేష్ తో రెండు సినిమాలకు ఒప్పందం చేసుకున్నారు పీవీపీ. కానీ బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత.. మహేష్ వేరే సినిమాల్లోకి వెళ్లిపోవడం.. తన బ్యానర్ పై సినిమా తీయకపోవడంపై ఆయన హర్ట్ అయ్యారట. పైగా వంశీ పైడిపల్లి సినిమాను తన బ్యానర్ కోసమే అని స్టోరీ డిస్కషన్స్ పూర్తి చేసి.. ఇప్పుడు దిల్ రాజ...

బిగ్ బాస్2 కోసం అ!లాంటి ప్రోమో!!

Image
వీడియో కోసం click చెయ్యండి బిగ్ బాస్2 అంటూ నాని వచ్చేస్తున్నాడు. ఆన్ స్క్రీన్ పై న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని.. దాదాపు మూడేళ్లుగా పరాజయం అన్నది చూడకుండా దూసుకుపోతున్నా.. చివరగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం మాత్రం నాని స్పీడుకు బ్రేకులేసింది. ఆ విషయాన్ని ఓపెన్ గా ఒప్పుకుని ఆకట్టుకున్న నాని.. ఇప్పుడు బుల్లితెరపై బిగ్ బాస్ హోస్ట్ గా అలరించబోతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2 కు నాని హోస్ట్ కాగా.. ఈ నెల 10 నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. పార్టిసిపెంట్స్ ఎవరనే విషయంపై తప్ప మిగిలిన డీటైల్స్ ప్రకటించారు. ఈ నెల 10 నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్2 కోసం.. ఇప్పుడు కొత్త టీజర్ ను కూడా విడుదల చేశారు. నాని రీసెంట్ గా నిర్మించి.. చేపకు డబ్బింగ్ చేసిన అ! మాదిరిగా ఈ ప్రోమో ఉండడం విశేషం. మనుషుల్లో అనేక రకాలు ఉంటారంటూ.. ఆయా వ్యక్తుల తీరును చూపేందుకు.. రకరకాల చేపలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అక్వేరియంలో ఉన్న చేపలకు ఫుడ్ వేస్తూ.. నాని వాయిస్ చెబుతున్న విషయాన్ని చివరలో రివీల్ చేశారు. అప్పటి వరకు అ! మూవీ టైపులో చేపకు డబ్బింగ్ చెబుతున్నట్లుగానే ఉంది. తన సినిమా థీమ్ తోనే బుల్లితెర రియాల్టీ షోకు ప్రో...

మరో వివాదంలో మహానటి

Image
తెలుగు ప్రేక్షకులంతా ఎంతో అభిమానించే సావిత్రి జీవిత గాథతో మహానటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సావిత్రి జీవితంలోని చూసిన ఎత్తుపల్లాలన్నింటినీ సజీవంగా కళ్లముందు నిలిపాడు. సావిత్రిగా కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందనే గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది.  అందరికీ తెలిసిన వ్యక్తుల బయోపిక్ తీయడం అంత సామాన్యమైన విషయమేం కాదు. ఏదో ఒక విషయంలో వివాదాలు తలెత్తడం మామూలే. ఇందుకు మహానటి మినహాయింపు ఏమీ కాదు. ఇప్పటికే జెమినీ గణేశన్ పెద్ద భార్య కుమార్తె తన తండ్రి గురించి తప్పుగా చూపించారంటూ ఫైరయింది. తాజాగా సావిత్రి పెదనాన్న కె.వి.చౌదరి సోదరుడి మనవరాలినంటూ విజయ అనే మహిళ మహానటి సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.  ఈ సినిమాలో చౌదరి పాత్రను మంచివాడిగా చూపించారని.. కానీ ఆయన షోమాన్ అని.. తాగుబోతు అని ఆరోపించింది. సావిత్రికి మద్యం అలవాటవడానికి కారణం అలాంటి వ్యక్తి పెంపకంలో పెరగడమూ ఒక కారణమని చెప్పుకొచ్చింది.  దీంతోపాటు సావిత్రి కుమార్తె చాముండేశ్వరి తీ...

అఫ్రిదీతో సెక్స్.. మళ్ళీ చెప్పింది

Image
నైటీ క్వీన్ అంటూ అర్షి ఖాన్ ను ఆడియన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇందుకు కారణం.. ఈ భామ బిగ్ బాస్ సీజన్ లో విపరీతంగా నైటీలు వాడేసి కనిపించడమే. తనను తాను హాట్ యాక్ట్రెస్ గా చెప్పుకునేందుకు ఏ మాత్రం సంశయించని ఈ సుందరాంగి.. వివాదాలను రాజేయడంలో కూడా బాగా ఆరితేరిపోయింది. 2015లో ఈమె చేసిన ఓ ట్వీట్ సెన్సేషనల్ అయిపోయింది. తాను పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో సెక్స్ చేశానని.. తామిద్దరం బాగా ఎంజాయ్ చేశామని.. అయినా తను ఎవరితో అయినా పడుకోవాలంటే.. అందుకు ఇండియన్ మీడియా అనుమతి తీసుకోవాలా అంటూ అర్షి ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ సమయంలో ఈ ట్వీట్ పై విపరీతమైన చర్చలు జరిగాయి. కొందరు తిట్టిపోశారు. మరికొందరు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ వివాదాన్ని కంటిన్యూ చేసిన అర్షి ఖాన్.. ఇప్పుడు విచిత్రంగా స్పందించింది. రీసెంట్ గా ఈ భామ రాజీవ్ ఖండేల్వాల్ నిర్వహించే టాక్ షో జాజ్ బాత్ లో పాల్గొంది. 'నాకు ఆఫ్రిది అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆ సమయంలో ఆయనను గురించి అలా ఓపెన్ గా ట్వీట్ చేయడం నా తప్పే. ఇలాంటి సెన్సిటివ్ అంశాల మీద అలా స్పందించకుండా ఉండాల్సింది. ఆఫ్రిది సాబ్ కు...

వైట్ల సార్.. టెక్నాలజీ కాదు కంటెంట్ కావాలి

Image
టాలీవుడ్టా విజయం కోసం ఎక్కువ ఆశలు పెట్టుకున్న దర్శకుల్లో ప్రస్తుతం శ్రీను వైట్ల టాప్ లో ఉన్నాడు. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ దర్శకుడు ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్ మహారాజాతో చేతులు కలిపాడు. మరో వైపు రవితేజ కూడా మళ్లీ పాత పద్దతిలోనే డిజాస్టర్ అందుకుంటున్నాడు. అయితే శ్రీను వైట్ల కంటెంట్ కంటే ఎక్కువగా విజువల్స్ పై ద్రుష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.  టాలీవుడ్ లో విజయం కోసం ఎక్కువ ఆశలు పెట్టుకున్న దర్శకుల్లో ప్రస్తుతం శ్రీను వైట్ల టాప్ లో ఉన్నాడు. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ దర్శకుడు ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్ మహారాజాతో చేతులు కలిపాడు. మరో వైపు రవితేజ కూడా మళ్లీ పాత పద్దతిలోనే డిజాస్టర్ అందుకుంటున్నాడు. అయితే శ్రీను వైట్ల కంటెంట్ కంటే ఎక్కువగా విజువల్స్ పై ద్రుష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

రానా కంటికి మళ్లీ ప్రాబ్లమ్??

Image
టాలీవుడ్ స్టార్ హీరో అనడం కన్నా బెస్ట్ యాక్టర్ లో ఒకరు అనడమే మంచి గుర్తింపు. అలాంటి గుర్తింపు అందుకున్న వారిలో రానా ఉన్నాడు. మంచి కథలు తన వరకు వస్తే ఏ మాత్రం మిస్ చేసుకొని ఈ హీరో ఎంతగా ఫెమస్ అయ్యాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే రానా చాలా కాలం తరువాత ఒక ఆపరేషన్ కోసం సిద్దమవుతున్నాడు. రానా కి ఒక కన్ను సరిగ్గా కనిపించదని అందరికి తెలిసిందే.  గతంలో చాలా సార్లు రానా ఆ విషయం గురించి ఏ మాత్రం బాధపడకుండా చెప్పాడు. అయితే ఆపరేషన్ నిమిత్తం రానా ఇప్పుడు సిద్దమవుతున్నాడు. తన కుడి కన్నుకు వైద్యం చేసే సమయం రావడంతో విదేశాలకు వెళ్లనున్నారు. రీసెంట్ గా సురేష్ బాబు ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. సర్జరీ కోసం యూఎస్ వెళుతున్నట్లు సురేష్ బాబు తెలిపారు.  తనపై ఒకరు జాలి చూపించడం ఈ హీరోకి నచ్చదు. అందుకే చాలా వరకు తన సమస్యను రానా ఎక్కువగా చెప్పుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం రానా చాలా షూటింగ్ లకు బ్రేక్ చెప్పేశాడు. మరికొన్నిటిని ఫినిష్ చేశాడు. అందులో చాలా వరకు బైలాంగ్యువల్ తెరకెక్కుతున్నవే!  

చైతు డేట్స్ క్లాష్ అవుతున్నాయే

Image
సాధారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది హీరోలు ఒక సినిమా షూటింగ్ అయిపోతే గాని మారో సినిమా ఒకే చేయడం లేదు.  స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు ఒక సినిమా తరువాత మరో సినిమా సెట్స్ పైకి తీసుకువెళుతున్నారు. ఎందుకంటే డేట్స్ విషయంలో ఎప్పుడో ఒకప్పుడు క్లాష్ అవ్వకుండా ఉండదు. అందుకే సినిమా షూటింగ్ ల విషయంలో మన హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాగ చైతన్య కి మొదటి సారి రెండు సినిమాలా షూటింగ్ ల వల్ల డేట్స్ క్లాష్ అయ్యాయి. అసలైతే ముందే సవ్యసాచి సినిమా విడుదల కావాలని ఫాస్ట్ గా సినిమా షూటింగ్ ని జరిపారు. కానీ మధ్యలో కొన్ని సీన్స్ మీద అనుమానంతో రీ షూట్ చేశారు. దీంతో అది కాస్త శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ కి ఎఫెక్ట్ పడింది. సాధారణంగా మారుతీ ఎక్కువ సమయం తీసుకోడు. ఆగస్ట్ లోనే షూటింగ్ పూర్తి చెయ్యాలని అనుకున్నాడు.  కానీ సవ్యాసాచి రీ షూట్ వల్ల చైతు డేట్స్ క్లాష్ అవుతున్నాయి. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. తొందరగా ఫినిష్ చేయాలనే ఆలోచన వల్ల మారుతి ప్లాన్ మొత్తం రివర్స్ అయినట్లు టాక్. శైలజా రెడ్డి మొదట అగస్ట్ 30న రిలీజ్ చెయ్యాలని చెబుతూ వస్తున్నారు. ఇక ...

ఆఫీసర్ గ్రేట్ మూవీ....శ్రీరెడ్డి

Image
కొంతకాలంగా నటి శ్రీరెడ్డి మీడియాకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. తన సంచలన వ్యాఖ్యలతో పాపులర్ అయిన శ్రీరెడ్డి అపుడపుడు సోషల్ మీడియాలో ఆ సంచలనాలను కొనసాగిస్తోంది. అపుడుపుడు లైవ్ సెషన్స్ లో తనకు నచ్చినట్టుగా మాట్లాడేసి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. పవన్ పై ఆర్జీవీ ప్రోద్బలంతో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా ఆర్జీవీకి మద్దతుగా నిలిచింది. వర్మ నాగ్ ల కాంబోలో తెరకెక్కిన `ఆఫీసర్` చిత్రంపై శ్రీరెడ్డి ప్రశంసలు కురిపిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో నాగార్జున చాలా బాగా నటించారని వర్మ గొప్ప దర్శకుడని కితాబిచ్చింది. కొంతమంది కావాలని పనిగట్టుకొని ఈ సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని ఆరోపించడం విశేషం.   వాస్తవానికి `ఆఫీసర్` సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. వర్మ ఖాతాలో మరో డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. వర్మ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆఫీసర్ గ్రేట్ మూవీ అంటూ శ్రీరెడ్డి ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  అంతేకాదు సినిమా చాలా బాగుందని థియేటర్ కు వెళ్లి చూడాలంటూ ప్రమోట్ చేస్...

క్రికెటర్ తో షారూక్ కూతురు సమ్ థింగ్ సమ్ థింగ్

Image
ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులను రంజింపజేయడమే కాదు కొత్త ప్రేమలకు వేదికవుతోందట. మైదానంలో ప్రతిభ చూపే క్రికెటర్లు - మ్యాచ్ లను చూడ్డానికి వచ్చే సినీ భామలకు మధ్య పొత్తు కుదురుతోంది. అంతేకాదు.. తాజాగా మరో ఐపీఎల్ ప్రేమ కథ ఒకటి వైరల్ అవుతోంది. అది... ఓ యువక్రికెటర్ - షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ల ప్రేమ కథ. కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని - బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ డిన్నర్లు - పార్టీలంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. ఇటీవలే 18వ పుట్టిన రోజు జరుపుకొన్న సుహానా శుభ్ లేకుండా బయటకు అడుగుపెట్టడం లేదట. ఇటీవలే దిల్లీలో ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న సుహానా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు శుభ్ తో సమ్ థింగ్ సమ్ థింగ్ అని తెలియడంతో సోషల్ మీడియాలో మరోసారి ఆమె హాట్ టాపిగ్గా మారిపోయింది.      సినీతారలు - క్రికెటర్ల లవ్ కొత్తేమీ కాకపోయినా షారుక్ కుమార్తె అనగానే అందరి దృష్టీ పడుతోంది. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మలు వివాహబంధంతో...

ముక్కల చెక్కలపైనా మళ్లీ మాట్లాడిన పవన్

Image
కలిసి ఉందామనుకునేటోళ్లు.. విడిపోవటం గురించి మాట్లాడుకుంటే ఎంత తప్పో.. విభజన గాయాలతో వేదన చెందుతున్న ఏపీ ప్రజల దగ్గర అదే పనిగా మరోసారి విభజన ప్రస్తావన తీసుకురావటం అంతే తప్పు. ఎంతసేపటికి తప్పు చేశాం.. తప్పు చేశామన్నట్లు కించపర్చుకునే తత్త్వాన్ని స్వార్థ రాజకీయాల కోసం తెర మీదకు తీసుకురావటం దుర్మార్గమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో కానీ.. ఈ మధ్యన అదే పనిగా ఏపీ మూడు ముక్కలు అయ్యే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఏపీ నాయకుల్లో లేనిది.. తెలంగాణ నాయకుల్లో ఉన్న తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాష్ట్ర విభజన నేరం మొత్తం ఆంధ్రా  ప్రాంత పాలకుల మీద వేసే తెలంగాణ నాయకులు.. తమ తప్పేం లేదన్నట్లుగా మాట్లాడతారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అంతలా పోరాడిన కేసీఆర్ సైతం.. గతంలో సమైక్యం మీద అసెంబ్లీలో ఎలా మాట్లాడరన్న దానికి సాక్ష్యంగా వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. గతంలో తాము మాట్లాడిన మాటల్ని.. అవసరం కోసం మార్చేస్తే .. వేలెత్తి చూపించే తెలంగాణ నాయకుడు కనిపించరు. ఎక్కడి దాకానో ఎ...

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

Image
10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం భృతిని అందించనుంది. కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా ఉండి.. ఉద్యోగం లేనివారికి ఈ భృతి చెల్లించేందుకు నిర్ణయించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. లబ్ధిదారుడి బ్యాంక్‌ అకౌంట్‌లోనే నిరుద్యోగ భృతి వేయనుంది ప్రభుత్వం. కుటుంబంలో ఇద్దరు అర్హులు ఉన్నా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే 22 నుంచి 35 ఏళ్ల వయస్సు కల్గినవారే ఇందుకు అర్హులుగా ప్రకటించింది. నిరుద్యోగ భృతి తీసుకున్నవారిని.. ప్రభుత్వం చేపట్టిన సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయనుంది. నిరుద్యోగ భృతి అమలుతో రాష్ట్ర ఖజానాపై ఏడాదికి 1200 కోట్లు రూపాయల భారం పడనుంది. రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం.. 12 దేశాల్లో ఇస్తున్న నిరుద్యోగ భృతిని పరిశీలించింది. మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం.. కొన్ని విధివిధానాలనూ కూడా రూపొందించింది. వీటిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాక.. వారి స్పందనను బట్టి మార్పులు చేర్పులు చేయనుంది. అనంతరం మరోసారి కేబినెట్‌లో చ...