చెల్లి కోసం వచ్చి పెళ్లయిన అక్కని తీసుకెళ్లాడు


చెన్నై: పెళ్లిచూపులకు వెళ్లడం, అమ్మాయి నచ్చితే వివాహం చేసుకోవడం, లేకుంటే మరో సంబంధానికి వెళ్లడం మగవారికి మామూలే. అయితే ఓ ప్రబుద్ధుడు చిన్నకూతురిని చేసుకునేందుకు పెళ్లిచూపులకు వచ్చి పెళ్లయి బిడ్డ తల్లయిన పెద్దమ్మాయిని లేపుకెళ్లాడు. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విచిత్రం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్‌లై వీధికి చెందిన ఓ వ్యక్తికి 26, 22 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లయి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
రెండో కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న ఆయన సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో అన్నాదురై (28) అనే వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి అమ్మాయిని చూశాడు. ఇదే సమయంలో పెద్దమ్మాయితో మాట కలిపి వెళ్లిపోయాడు. పెళ్లిచూపుల గురించి అమ్మాయి తండ్రికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే పెద్దమ్మాయితో టచ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని అన్నాదురైతో అక్క ఇల్లు వదిలి లేచిపోయింది.

Comments

Popular posts from this blog

మోహన్ బాబు పుణ్యమే అంటున్న విశాల్

ప్రియదర్శి ఇంట ‘పెళ్లి సందడి’

చైతు అంత నచ్చాడా మాధవ్