ఎప్పటికీ శ్రీదేవి నాతోనే ఉంటుంది:బోనీ
ఈ ఏడాది ఫిబ్రవరి 24న `అతిలోక సుందరి` - ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దుబాయ్ లో బంధువుల వివాహవేడుకకు హాజరైన శ్రీదేవి....అక్కడి జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయిన విషయం విదితమే. శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె భర్త బోనీకపూర్ - కూతుళ్లు జాన్వీ - ఖుషీలతో పాటు అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో జూన్ 2న తమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బోనీకపూర్ బాధాతప్త హృదయంతో ఓ ట్వీట్ చేశారు. తన అర్ధాంగి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లినా....ఆమె తన జ్ఞాపకాల్లో ఎల్లపుడూ జీవించే ఉంటుందని ట్వీట్ చేశారు. గతంలో దివంగత శ్రీదేవి ఉపయోగించిన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా``శ్రీదేవీ బోనీ కపూర్ ``లో బోనీ కపూర్ ఈ ట్వీట్ చేయడం విశేషం. ఆ ట్వీట్ తో పాటు దుబాయ్ లో జరిగిన వివాహ వేడుకలో ఆఖరిసారి శ్రీదేవి చేసిన సందడి దృశ్యాల వీడియోను కూడా బోనీ కపూర్ పోస్ట్ చేశారు.
1996 - జూన్ 2న బోనీ కపూర్ - శ్రీదేవిల వివాహం జరిగింది. వారిద్దరికీ 1997లో జాన్వీ జన్మించగా - 2000లో ఖుషి జన్మించింది. ఈ ఏడాది జాన్వీ బాలీవుడ్ లో తెరంగేట్రం చేయబోయే లోపే శ్రీదేవి హఠాన్మరణం చెందింది. అయితే శ్రీదేవి ఎక్కడికి వెళ్లలేదని - భౌతికంగా ఆమె దూరమైనప్పటికీ...ఆమె తమతో ఉందని బోనీ కపూర్ ట్వీట్ చేశారు.
``ఈ రోజు మన 22వ వివాహ వార్షికోత్సవ దినోత్సవం అయ్యుండేది. నా ప్రాణం....నా అర్ధాంగి.... నాలో సగభాగం...నేను అమితంగా ప్రేమించే వ్యక్తి అయిన శ్రీదేవి నాలో ఎప్పటికీ జీవించే ఉంటుంది. అని బోనీ ఆవేదనపూరిత ట్వీట్ చేశారు. దాంతో పాటు శ్రీదేవి సంతోషంగా గడిపిన చిట్టచివరి క్షణాలున్న వీడియోను బోనీ ట్వీట్ చేశారు. ఆ వీడియోలో....పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు - ఆత్మీయులతో శ్రీదేవి సరదాగా సంభాషిస్తూ హుషారుగా గడిపింది. కొందరి సన్నిహితులు మిత్రులతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. ``లెజెండ్ కన్నా నువ్వు చాలా గొప్పదానివి.....నువ్వు లేని లోటు ఎప్పటికీ భర్తీ కాదు``అని ఆ వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది

Comments
Post a Comment