క్రికెటర్ తో షారూక్ కూతురు సమ్ థింగ్ సమ్ థింగ్
ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులను రంజింపజేయడమే కాదు కొత్త ప్రేమలకు వేదికవుతోందట. మైదానంలో ప్రతిభ చూపే క్రికెటర్లు - మ్యాచ్ లను చూడ్డానికి వచ్చే సినీ భామలకు మధ్య పొత్తు కుదురుతోంది. అంతేకాదు.. తాజాగా మరో ఐపీఎల్ ప్రేమ కథ ఒకటి వైరల్ అవుతోంది. అది... ఓ యువక్రికెటర్ - షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ల ప్రేమ కథ.
కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని - బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ డిన్నర్లు - పార్టీలంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. ఇటీవలే 18వ పుట్టిన రోజు జరుపుకొన్న సుహానా శుభ్ లేకుండా బయటకు అడుగుపెట్టడం లేదట. ఇటీవలే దిల్లీలో ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న సుహానా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు శుభ్ తో సమ్ థింగ్ సమ్ థింగ్ అని తెలియడంతో సోషల్ మీడియాలో మరోసారి ఆమె హాట్ టాపిగ్గా మారిపోయింది.

Comments
Post a Comment