ఈ సమ్మర్ ఆమెదేనబ్బా..
పెళ్లి అయినంత మాత్రాన కథానాయిక కథ ముగిసిందని అనుకోవడానికేమీ లేదని రుజువు చేసిన సూపర్ హీరోయిన్ సమంత అక్కినేని. పెళ్లయ్యాక కూడా తన ఉనికిని చాటుకోవడమే కాదు.. తిరుగులేని విజయాలతో కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్తోందామె. నెలన్నర వ్యవధిలో మూడు భారీ విజయాలందుకుని.. ఆ మూడు సినిమాలతో మంచి పేరు కూడా సంపాదించి అబ్బురపరిచింది సామ్. 2018 వేసవి సమంతకే సొంతమని చెప్పాలి. సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియా మొత్తంలో సమంతలా ఈ సమ్మర్లో హవా సాగించిన ఆర్టిస్టు మరొకరు లేరు.
ఈవేసవి ఆరంభంలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అందులో సమంత నటనకు గొప్ప ప్రశంసలు కూడా లభించాయి. ఇక గత నెలలో‘మహానటి’ లాంటి మెమొరబుల్ మూవీతో పలకరించింది సామ్. ఈ చిత్రంలోనూ సమంత పాత్ర.. నటన ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఈ చిత్రం తమిళంలోనూ అదరగొట్టింది. ‘మహానటి’ వచ్చిన రెండు రోజులకే తమిళంలో విడుదలైన ఆమె కొత్త సినిమా ‘ఇరుంబు తిరై’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట సమ్మె తర్వాత రిలీజైన పెద్ద సినిమా ఇదే. ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు తగ్గట్లే టాక్ అదిరిపోయింది. మంచి వసూళ్లు వచ్చాయి. సమంత పాత్రకూ మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై విజయవంతంగా నడుస్తోంది. మూడు సినిమాలతో ఐదు విజయాలు ఖాతాలో వేసుకుని సమంత తనకు తిరుగులేదని చాటుకుంది. మొత్తానికి విజయాలకు విజయాలు.. పేరుకు పేరు.. సమంతకు ఇంతకంటే ఏం కావాలి?

Comments
Post a Comment