లేడి ఒరియెంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్న కాజల్
కాజల్కాగర్వాల్ డ్రీమ్స్ ఇంకా తీరలేదట
ఆశకు అంతం ఉండదంటారు. టాలీవుడ్ చందమమా కాజల్ ఈ కోవకు చెందన వ్యక్తినే అనిపిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీస్ లో టాప్ హీరోయిన్ అనిపించుకుంది. బాలీవుడ్ లో సైతం ఒకటి రెండు సక్సెస్ లు అందుకుంది. బట్ అక్కడ ఈ బ్యూటీ కోరుకున్న స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతోంది. ఈ లాంగ్ జర్నీలో కాజల్ అగర్వాల్ కోరిక మాత్రం తీరలేదట. దీంతో కొన్ని కలలు కలలుగానే మిలిగిపోతాయేమో అని నిటూర్పుగా చెప్పుతోంది. అసలు అలాంటి కోరికలు నేరవేరితే ఎంత బాగుండో అనిపిస్తోందని కానీ ఎందుకో అవి తీరడం లేదని ఈ బ్యూటీ తెగ బాధపడుతోంది.
కాజల్ అగర్వాల్ కి లేడి ఓరియెంట్ మూవీస్ చేయాలని ఉందట. అవి కూడా అల్లాటప్పా మూవీస్ కాదట. లేడి బ్రూస్ లీ రేంజ్ లో కాజల్ అగర్వాల్ పంచ్ లతో విలన్స్ ని చిత్తు చేసే హెవీ యాక్షన్, మూవీ చేయాలనేది ఆమె డ్రీమ్ అట. దీంతో పాటు పుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్స్ లో కూడా నటించాలనే ఆశ ఉందంట. కానీ ఈ పదేళ్ల లో అలాంటి యాక్షన్ క్యారెక్టర్స్ లో నటించలేదని, అందుకే అలాంటి పాత్రలు కలగానే మిగిలిపోయాయని ఈ బ్యూటీ బాధపడుతోంది. వ్యక్తిగతంగా తనకు మంచి భావోద్రేక కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలంటేనే ఇష్టమని కాజల్ చెప్పుతోంది. ఇక భాషా భేదం లేకుండా అన్ని భాషా చిత్రాల్లోనూ నటించాలని ఈ బ్యూటీ నిర్ణయించుకుందట. అసలే కాజల్ అసలు సిసలు గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ అలాంటిది ఈ అందాల భామ అదిరిపోయే పంచ్ లతో యాక్షన్ ఇరగదీస్తే కుర్రాళ్ల గుండెలకు గాయాలు కావాల్సిందే.
అదే విధంగా కాజల్ అగర్వాల్ హాలీవుడ్ లో సైతం నటించాలనే ఆశను బయటపెట్టింది. ఇండియాలోని టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ లో స్టార్ డమ్ వచ్చేసింది కాబట్టి ఒక్క ఇంటర్నేషన్ మూవీ అయిన చేయాలని ఈ బ్యూటీ ఆశపడుతోందట. బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన ఈ బ్యూటీకి మరి హాలీవుడ్ లో ఎవరూ ఛాన్స్ ఇస్తారో చూడాలి.ఇక రిసెంట్ గా తెలుగులో మరో ఛాన్స్ పట్టేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమాలో ఈ బ్యూటీనే హీరోయిన్ గా తీసుకున్నారు.

Comments
Post a Comment