Posts

చైతు అంత నచ్చాడా మాధవ్

Image
నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి కోసం చాలా ఏళ్ళ తర్వాత మాధవన్ తెలుగు స్ట్రెయిట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే . గతంలో ఎన్నో సినిమాల కోసం ఆఫర్స్ వచ్చినప్పటికీ తెలుగు బాష మీద గ్రిప్ లేని కారణంగా వదిలేసుకుంటూ వచ్చిన మాధవన్ ను సవ్యసాచి కథ మాత్రం బాగా ఎగ్జైట్ చేసిందట. అందుకే ఒప్పుకున్నట్టు తెలిసింది. దానికి తోడు చందు మొండేటి థ్రిల్లర్ ని టేకప్ చేసిన తీరు కార్తికేయలో చూసిన మాధవన్ ఎక్కువ ఆలోచించకుండా ఓకే చేసినట్టు తెలిసింది. సవ్యసాచి ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజి లో ఉంది. విడుదల ఇంకా ఖరారు కాలేదు. దీని తర్వాత చైతు నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇంతకు ముందే చెప్పాడు. శైలజరెడ్డి అల్లుడు తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది.  ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం మాధవన్ నే తీసుకోబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. సవ్యసాచి టైంలో చైతుకు మాధవన్ కు మంచి బాండింగ్ కుదరటంతో దీనికి కోసం రాయబారానికి చైతూనే పంపారట యూనిట్. కానీ మాధవన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. సవ్యసాచిలో తనకు వచ్చే స్పందన బట్టి నిర్ణయం తీసుకుంటానని చ...

ఈ సమ్మర్ ఆమెదేనబ్బా..

Image
పెళ్లి అయినంత మాత్రాన కథానాయిక కథ ముగిసిందని అనుకోవడానికేమీ లేదని రుజువు చేసిన సూపర్ హీరోయిన్ సమంత అక్కినేని. పెళ్లయ్యాక కూడా తన ఉనికిని చాటుకోవడమే కాదు.. తిరుగులేని విజయాలతో కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్తోందామె. నెలన్నర వ్యవధిలో మూడు భారీ విజయాలందుకుని.. ఆ మూడు సినిమాలతో మంచి పేరు కూడా సంపాదించి అబ్బురపరిచింది సామ్.  2018 వేసవి సమంతకే సొంతమని చెప్పాలి. సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియా మొత్తంలో సమంతలా ఈ సమ్మర్లో హవా సాగించిన ఆర్టిస్టు మరొకరు లేరు.  ఈవేసవి ఆరంభంలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అందులో సమంత నటనకు గొప్ప ప్రశంసలు కూడా లభించాయి. ఇక  గత నెలలో‘మహానటి’ లాంటి మెమొరబుల్ మూవీతో పలకరించింది సామ్. ఈ చిత్రంలోనూ సమంత పాత్ర.. నటన ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఈ చిత్రం తమిళంలోనూ అదరగొట్టింది. ‘మహానటి’ వచ్చిన రెండు రోజులకే తమిళంలో విడుదలైన ఆమె కొత్త సినిమా ‘ఇరుంబు తిరై’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట సమ్మె తర్వాత రిలీజైన పెద్ద సినిమా ఇదే. ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు తగ్గట్లే టాక్ అదిరిపోయింది. మంచి వసూళ్లు వచ్చాయి. సమంత పాత్రకూ మంచి పేరు వచ్చింద...

ఎప్పటికీ శ్రీదేవి నాతోనే ఉంటుంది:బోనీ

Image
ఈ ఏడాది ఫిబ్రవరి 24న `అతిలోక సుందరి` - ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దుబాయ్ లో బంధువుల వివాహవేడుకకు హాజరైన శ్రీదేవి....అక్కడి జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయిన విషయం విదితమే. శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె భర్త బోనీకపూర్ - కూతుళ్లు జాన్వీ - ఖుషీలతో పాటు అభిమానులంతా  శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో  జూన్ 2న తమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బోనీకపూర్ బాధాతప్త హృదయంతో ఓ ట్వీట్ చేశారు. తన అర్ధాంగి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లినా....ఆమె తన జ్ఞాపకాల్లో ఎల్లపుడూ జీవించే ఉంటుందని ట్వీట్ చేశారు. గతంలో దివంగత శ్రీదేవి ఉపయోగించిన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా``శ్రీదేవీ బోనీ కపూర్ ``లో బోనీ కపూర్ ఈ ట్వీట్ చేయడం విశేషం. ఆ ట్వీట్ తో పాటు దుబాయ్ లో జరిగిన వివాహ వేడుకలో ఆఖరిసారి శ్రీదేవి చేసిన సందడి దృశ్యాల వీడియోను కూడా బోనీ కపూర్ పోస్ట్ చేశారు.   1996 - జూన్ 2న బోనీ కపూర్ - శ్రీదేవిల వివాహం జరిగింది. వారిద్దరికీ 1997లో జాన్వీ జన్మించగా - 2000లో ఖుషి జన్మించింది. ఈ ఏడాది జాన్వీ బాలీవుడ్ లో తెరంగేట్రం చేయబోయే ల...

అప్పుడు నానికి ఇప్పుడు తేజుకి

Image
సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యు జూన్ 29 విడుదల కోసం రెడీ అవుతోంది. ఇంకా టైం ఉన్నప్పటికీ ప్రమోషన్ ప్రాధాన్యత తెలుసు కాబట్టి టీమ్ ఇప్పటి నుంచే అలెర్ట్ గా ఉంటోంది. నిన్న సరదాగా తేజ్ ఐ లవ్ యు యూనిట్ కు రేడియో ఆర్జెలకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఆల్బమ్ లోని మొదటి పాట  అందమైన చందమామ ను విడుదల చేసారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి దర్శకుడు కరుణాకరన్. తెలుగులో తన మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ నుంచి సంగీతం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే కరుణాకరన్ తేజ్ ఐ లవ్ యు కోసం కూడా అవే ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపిస్తోంది. నిన్ను కోరి-ఊపిరి లాంటి సెన్సిబుల్ మూవీస్ కి అద్భుతమైన స్కోర్ ఇచ్చిన గోపి సుందర్ దీనికి కూడా అదే మేజిక్ చేసుకుంటాడు అనే అంచనాలో ఉన్నారు మ్యూజిక్ లవర్స్. దానికి తగ్గట్టే  నిన్న రిలీజ్ చేసిన అందమైన చందమామ పాట స్లో పాయిజన్ లాగా మెలోడీ లవర్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. క్యాచీ పదాలతో సీనియర్ రచయిత సాహితి చక్కని సాహిత్యం అందించారు క్యూట్ మెలోడీగా ఫస్ట్ సాంగ్ పాస్ అయిపోయింది కాబట్టి నాని కోసం ఇ...

మోహన్ బాబు పుణ్యమే అంటున్న విశాల్

Image
తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు నిర్మించిన జీకే రెడ్డి తనయుడు విశాల్. నిజానికి అతను హీరో కావాలని అనుకోలేదు. దర్శకుడు కావాలని అనుకున్నాడు. ఆ విభాగంలో పని చేశాడు కూడా. విశాల్ అన్న హీరో కావాలనుకున్నాడు. కానీ జరిగింది వేరు. విశాల్ హీరో అయ్యాడు. అతడి అన్నయ్య నిర్మాతగా మారాడు. ఐతే తాను హీరోగా మారడంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పాత్ర కీలకం అంటున్నాడు విశాల్. తనలో హీరో లక్షణాలున్నాయని.. హీరోను చేయమని తన తండ్రికి ముందుగా సలహా ఇచ్చింది మోహన్ బాబే అని విశాల్ వెల్లడించడం విశేషం. విశాల్ కొత్త సినిమా ‘అభిమన్యుడు’ విజయవంతం అయిన నేపథ్యంలో మంచు విష్ణు అతడికి అభినందనలు తెలపగా.. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు విశాల్. నేను హీరో కావడానికి మీ నాన్నే కారణం.. ఇప్పుడు నేనీ స్థాయిలో అందుకు ఆయన మా నాన్నకిచ్చిన సలహా వల్లే. ‘అభిమన్యుడు’ సక్సెస్ లో కూడా ఆయనకు క్రెడిట్ ఉంది.. అని విశాల్ అన్నాడు. చెల్లమే (తెలుగులో ప్రేమ చదరంగం) అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయిన విశాల్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. గత కొన్నేళ్లలో వైవిధ్యమైన థ్రిల్లర్లతో పెద్ద హిట్లు కొట్టాడు. ఐతే ఒకప్పుడు విశాల్ కు తెలుగులోనూ మంచి ...

చైతు మూవీలో మ్యాడీ పాత్ర ఇదేనా

Image
నాగ చైతన్య హీరోగా చందు మొండేటి రూపొందిస్తున్న సవ్యసాచి షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. నిజానికి ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ నెల మూడో వారంలో విడుదల కావాలి. కానీ కొంత ప్యాచ్ వర్క్ తో పాటు సిజి కూడా బాలన్స్ ఉండటంతో ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇకపోతే ఇందులో మాధవన్ నటించిన రోల్ ఎలా ఉంటుందా అనే అంచనాలు ముందు నుంచి ఆసక్తి రేపుతూనే ఉన్నాయి. తన బర్త్ డే సందర్బంగా  విషెస్ చెబుతూ యూనిట్ షేర్ చేసుకున్న స్టిల్ లో మాధవన్ లుక్ చూస్తుంటే ఇందులో ఏదో స్టైలిష్ విలన్ గా కొత్త తరహా పాత్ర  చేసినట్టు కనిపిస్తోంది. అంటే ముందు నుంచి అనుకున్నట్టు చైతుకు ఛాలెంజ్ విసిరే పవర్ ఫుల్ పాత్రలో మాధవన్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇది  పోస్టర్ ని బట్టి వేసిన అంచనానే అయినప్పటికీ నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ తక్కువ స్థాయిలో ఇంతవరకు ఏ సినిమా నిర్మించని  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందటం ట్రేడ్ లో ఆసక్తి రేపుతోంది.  ఒక చేయి తన ఆధీనంలో ఉండని ఆసక్తికరమైన పాత్ర చేస్తున్న చైతుతో మాధవన్ ఆడే ఆట చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. దానికి తో...

లేడి ఒరియెంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్న కాజల్

Image
కాజల్కాగర్వాల్ డ్రీమ్స్ ఇంకా తీరలేదట ఆశకు అంతం ఉండదంటారు. టాలీవుడ్ చందమమా కాజల్‌ ఈ కోవకు చెందన వ్యక్తినే అనిపిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్‌ ఇండస్ట్రీస్ లో టాప్ హీరోయిన్ అనిపించుకుంది. బాలీవుడ్ లో సైతం ఒకటి రెండు సక్సెస్ లు అందుకుంది. బట్ అక్కడ ఈ బ్యూటీ కోరుకున్న స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతోంది. ఈ లాంగ్ జర్నీలో కాజల్‌ అగర్వాల్‌ కోరిక మాత్రం తీరలేదట. దీంతో కొన్ని కలలు కలలుగానే మిలిగిపోతాయేమో అని నిటూర్పుగా చెప్పుతోంది. అసలు అలాంటి కోరికలు నేరవేరితే ఎంత బాగుండో అనిపిస్తోందని కానీ ఎందుకో అవి తీరడం లేదని ఈ బ్యూటీ తెగ బాధపడుతోంది. కాజల్ అగర్వాల్ కి లేడి ఓరియెంట్ మూవీస్ చేయాలని ఉందట. అవి కూడా అల్లాటప్పా మూవీస్ కాదట. లేడి బ్రూస్ లీ రేంజ్ లో కాజల్ అగర్వాల్ పంచ్ లతో విలన్స్ ని చిత్తు చేసే హెవీ యాక్షన్, మూవీ చేయాలనేది ఆమె డ్రీమ్ అట. దీంతో పాటు పుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్స్ లో కూడా నటించాలనే ఆశ ఉందంట. కానీ ఈ పదేళ్ల లో అలాంటి యాక్షన్‌ క్యారెక్టర్స్ లో నటించలేదని, అందుకే అలాంటి పాత్రలు కలగానే మిగిలిపోయాయని ఈ బ్యూటీ బాధపడుతోంది. వ్యక్తిగతంగా తనకు మంచి భ...